రుద్రంపూర్, ఏప్రిల్ 18 : పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న పదో తరగతి ఉత్తీర్ణులైన బాల బాలికలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రుద్రంపూర్ (కొత్తగూడెం)లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించబడుతుందన్నారు. ఈ శిక్షణ తరగతులు ప్రతి రోజూ ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించబడుతాయన్నారు. పూర్తి వివరాల కోసం 7989103699 నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.