వృద్ధుల పింఛన్ నగదుతో ఉడాయించిన కేటుగాడు
ఆసరాగా నిలిచే వృద్ధాప్య పింఛన్ డబ్బులపై కన్నేశాడో కేటుగాడు. కొత్త పథకం కింద అదనపు డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. ఇద్దరు అమాయక వృద్ధుల వద్ద నుంచి రూ. 4 వేల నగదు కాజేసిన ఘటన జూలూరుపాడు మండల కేంద్రంలో సోమవారం వెలుగుచూసింది.
– మాయమాటలు చెప్పి రూ.4 వేలు స్వాహా
- జూలూరుపాడు ఎస్బీఐ వద్ద ఘటన
జూలూరుపాడు, అక్టోబర్ 26 : ఆసరాగా నిలిచే వృద్ధాప్య పింఛన్ డబ్బులపై కన్నేశాడో కేటుగాడు. కొత్త పథకం కింద అదనపు డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. ఇద్దరు అమాయక వృద్ధుల వద్ద నుంచి రూ. 4 వేల నగదు కాజేసిన ఘటన జూలూరుపాడు మండల కేంద్రంలో సోమవారం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన వృద్ధులు గంజి కనకమ్మ, కొల్లి జగన్నాధం తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన వృద్ధాప్య పింఛన్ డబ్బులు డ్రా చేసుకునేందుకు సోమవారం జూలూరుపాడులోని ఎస్బీఐ బ్యాంకుకు వచ్చారు. నగదు తీసుకుని బ్యాంకు నుంచి బయటకు వస్తున్న క్రమంలో.. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి వారి వద్దకు చేరుకున్నాడు. మాటలు కలిపి వృద్ధులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొత్త పథకం ప్రవేశపెట్టారని, మీకు పింఛన్‌గా వచ్చిన రూ.2 వేలతో పాటు అదనంగా మరో రూ.2 వేలు కలిపి ఇస్తున్నారని వారిని నమ్మబలికించాడు. ఆ అదనపు డబ్బులు ఇప్పుడే ఇస్తానని, లోపలికి వెళ్లి చిల్లర తీసుకువస్తానంటూ వృద్ధుల వద్ద ఉన్న రూ.4 వేల నగదును తీసుకుని తన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంతసేపటికీ సదరు వ్యక్తి తిరిగి రాకపోవడంతో.. తాము మోసపోయామని గ్రహించిన వృద్ధులు కనకమ్మ, జగన్నాధం కన్నీరుమున్నీరుగా విలపించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

