‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, గతంలో రద్దు చేసిన కొల్హాపూర్, కాజీపేట, డోర్నకల్ రైళ్లను తక్షణమే పునఃప్రారంభించాలని నూతన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ డీఆర్‌యూసీసీ మెంబర్ భీమా శ్రీధర్ రైల్వే అధికారులను కోరారు.
– డీఆర్ఎం గోపాలకృష్ణకు భీమా శ్రీధర్ వినతి
కొత్తగూడెం, అక్టోబర్ 23 : కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, గతంలో రద్దు చేసిన కొల్హాపూర్, కాజీపేట, డోర్నకల్ రైళ్లను తక్షణమే పునఃప్రారంభించాలని నూతన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ డీఆర్‌యూసీసీ మెంబర్ భీమా శ్రీధర్ రైల్వే అధికారులను కోరారు. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం గోపాలకృష్ణను కలిసి పలు సమస్యలతో కూడిన వినతులను సమర్పించారు. వచ్చే ఏడాది జూన్, జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి, భక్తులకు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక రైలులో వచ్చిన డీఆర్ఎం గోపాలకృష్ణకు నూతన డీఆర్‌యూసీసీ మెంబర్ భీమా శ్రీధర్, 60వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గతంలో రద్దు చేసిన కొల్హాపూర్, కాజీపేట, డోర్నకల్ రైళ్లను తిరిగి నడిపించాలని కోరారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్ నుండి గొల్లగూడెం వరకు రోడ్డు విస్తరణకు అవసరమైన రైల్వే స్థలాన్ని కేటాయించాలని డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ రహదారి విస్తరణ పూర్తయితే స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని వివరించారు. ఈ అంశంపై గతంలో ఖమ్మం రైల్వే స్టేషన్ కోసం ప్రభుత్వ భూమిని కేటాయించిన నేపథ్యంలో కొత్తగూడెంలో రోడ్డు విస్తరణకు కేటాయించిన స్థలానికి తక్షణమే హద్దులు ఏర్పాటు చేసి, రహదారి నిర్మాణానికి సహకరించాలని కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

