చండ్రుగొండ, జూలై 19 : పిడుగుపాటుకు రైతు మృతి చెందిన సంఘటన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం వెంకటాయతండా గ్రామంలో చోటుచేసుకుంది. చండ్రుగొండ మండలం వెంకటయతండా గ్రామానికి చెందిన రైతు బానోతు రవి (38) తన పత్తి చేనులో అరకతో పైపాటు చేస్తుండగా శనివారం సాయంత్రం వేళలో ఉరుములతో కూడిన వర్షం అకస్మాత్తుగా ప్రారంభమైంది. ఈ క్రమంలో పంట చేనులో ఉన్న రైతు బానోతు రవిపై పిడుగు పడిపోయాడు. వెంటనే తోటి రైతులు గ్రామస్తులు కలిసి హుటాహుటిన చండ్రుగొండలోనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రవికి భార్య కవిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, తోటి రైతులు కోరుతున్నారు.