ఈ-వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన
ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోడ్రన్ ఇఖ్రా పాఠశాల కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్త పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని...
రుద్రంపూర్, అక్టోబర్ 27 : ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోడ్రన్ ఇఖ్రా పాఠశాల కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్త పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 12వ వార్డు రామవరం సుభాష్ చంద్రబోస్ నగర్లో ఉన్న మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఈ-వ్యర్థాల వల్ల కలిగే నష్టాలపై పోస్టర్, పెయింటింగ్, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను అవసరం లేకుండా తరచూ మార్చడం వల్ల ఈ-వ్యర్థాలు పెరిగిపోతున్నాయని, పాడైన వస్తువులను సాధ్యమైనంతవరకు మరమ్మతు చేసి తిరిగి వినియోగించాలని సూచించారు.
ఈ-వ్యర్థాల్లోని హానికర పదార్థాలు భూమి, నీరు, గాలిని కలుషితం చేసి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని వివరించారు. భవిష్యత్ తరాలకు కలుషితం లేని గాలి, స్వచ్ఛమైన నీరు, పచ్చని చెట్లతో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల పరిసరాల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, స్థానికులకు ఈ-వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు ప్రసన్న, నాజియా, సరస్వతి, నుస్రత్, సల్మా జాఫర్, ఖాజాతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈ-వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పట్టభద్రుల ఓటరు నమోదు
Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
Nutrition | పోషకాహారం అధికంగా తీసుకోవడం లేదా వ్యాయామ తీవ్రత.. గుండె జబ్బులకు ఏది కారణం..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

