రామవరం, జూన్ 20 : పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు, బడిలో అని మాటలు చెప్పే అధికారులు… బడిలో కనీసం నీళ్ల వసతి కల్పించకపోవడంతో పిల్లలు తాము తాగే నీటిని వారే మోసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో ఉన్నజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో తాగేందుకు నీళ్లు లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థులు వాటర్ క్యాన్లలో నీళ్లు మోసుకుంటూ బడికి వెళ్తున్నారు. పంచాయతీ కార్యాలయంలోని వాటర్ ప్లాంట్ నుండి విద్యార్థులు నీటిని మోసుకెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలలో తాగునీటి వసతి కల్పించి విద్యార్థులకు మోత బరువు తప్పించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.