‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
ఇల్లెందు పట్టణంలో తరచుగా వస్తున్న తాగునీటి సమస్య, పైప్‌లైన్ లీకేజీని నియంత్రించాలని సిపిఎం శ్రేణులు రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో సాహితీ కాలేజీ రోడ్డులో లీకేజీని అరికట్టడంలో...
– తాగునీటి సమస్య, పైప్‌లైన్ లీకేజీని నియంత్రించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
ఇల్లెందు, అక్టోబర్ 23 : ఇల్లెందు పట్టణంలో తరచుగా వస్తున్న తాగునీటి సమస్య, పైప్‌లైన్ లీకేజీని నియంత్రించాలని సిపిఎం శ్రేణులు రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో సాహితీ కాలేజీ రోడ్డులో లీకేజీని అరికట్టడంలో మున్సిపాలిటీ వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా రోజు 1,500 మంది పిల్లలు అవస్థలు పడుతున్నట్లు పేర్కొంటూ సిపిఎం నాయకులు రోడ్డుపై నీళ్లు ఉన్నచోట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక 15వ వార్డులోని మెయిన్ రోడ్డు నుండి సాహితీ కాలేజీ మార్గదర్శిని ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు వెళ్లేదారిలో గత నెల రోజులుగా మున్సిపాలిటీ పైప్ లైన్ లీకేజీ ఫలితంగా రోజూ 1,500 మంది పిల్లలు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు.
మంత్రి మండలి ప్రత్యేక కమిటీ వేసినా తమ మున్సిపాలిటీకి పట్టదా, ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గం స్పందించి నీటి లీకేజీని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ఫలితంగా ప్రతి నీటి బొట్టును రక్షించండి, కాపాడండి, పొదుపు చేయండి అని ఓ వైపు ముఖ్యమంత్రి ప్రకటనలు ఇస్తుంటే మరోవైపు ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో పైపులైను ఎక్కడపడితే అక్కడ లీకేజీలు అవుతున్నా పట్టించుకోవడం లేదని సిపీఎం జిల్లా నాయకులు అబ్ధుల్ నబి, పార్టీ మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మన్యం మోహన్ రావు, షేక్ ఖాదర్ మాదారపు వెంకటేశ్వర్లు, రాజయ్య పాల్గొన్నారు.

‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

