‘హక్కు పత్రాలు లేకుండా పోడు సాగు చేయొద్దు’
అటవీ హక్కుల చట్టం ప్రకారం చెల్లుబాటయ్యే అటవీ హక్కు పత్రాలు లేకుండా భూముల్లో పోడు సాగు చేయవద్దని, దుక్కులు దున్ని పంటలు వేయొద్దని ముసలిమడుగు సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అనార్కలి అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని బుడ్డగూడెం గ్రామంలోని..
– ఆదివాసీల అవగాహన సదస్సులో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అనార్కలి
బూర్గంపహాడ్, జూలై 15 : అటవీ హక్కుల చట్టం ప్రకారం చెల్లుబాటయ్యే అటవీ హక్కు పత్రాలు లేకుండా భూముల్లో పోడు సాగు చేయవద్దని, దుక్కులు దున్ని పంటలు వేయొద్దని ముసలిమడుగు సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అనార్కలి అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని బుడ్డగూడెం గ్రామంలోని ఆదివాసీలకు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పోడు సాగుపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చట్ట విరుద్ధంగా అడవులను నరికి ప్రభుత్వ ప్లాంటేషన్లు ధ్వంసం చేసి పోడు సాగు చేస్తే అటవీ చట్టాలు, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా అడవులను ఆక్రమించి పోడు భూములు సృష్టించవద్దని, అడవులకు నిప్పు పెట్టకూడదని, వన్యప్రాణులను వేటాడరాదని, అటవీ సంపదను భావితరాలకు పరిరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యత అని వివరించారు.
అటవీ పరిరక్షణలో గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సహకరించాలని, ఎలాంటి అక్రమాలు అడవుల్లో జరిగినా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సదస్సులో సోంపల్లి మాజీ సర్పంచ్ తాటి వీరాంజనేయులు, కార్యదర్శి వెంకటేశ్వర్లు, బీట్ ఆఫీసర్లు సోడె శ్రీరాములు, మడకం వీరేందర్, బానావత్ సురేష్, భూక్యా పద్మ, రామ్మూర్తి, నవీన్, ఝాన్సీ, గ్రామస్తులు నాగమణి, బంగారమ్మ, సుభద్ర, పిచ్చమ్మ, రాజమ్మ, రామలక్ష్మి, సరోజిని, సుజాత, జగదీష్, సావిత్రి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

