గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు తగిన పర్యవేక్షణ వహించాలని కొత్తగూడెం డీఎస్పీ ఎల్.ఆదినారాయణ కోరారు. అలాగే కోడి పందాలు, పేకాట, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
రుద్రంపూర్, అక్టోబర్ 10 : యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు తగిన పర్యవేక్షణ వహించాలని కొత్తగూడెం డీఎస్పీ ఎల్.ఆదినారాయణ కోరారు. అలాగే కోడి పందాలు, పేకాట, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు సుజాతనగర్ మండల పరిధిలోని గరీబ్‌పేట గ్రామంలో శనివారం తెల్లవారుజామున 04:00 నుండి 07:00 గంటల వరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 68 ద్విచక్ర వాహనాలు, 19 త్రిచక్ర వాహనాలను గుర్తించి, మొత్తం 87 వాహనాలపై చట్టప్రకారం జరిమానాలు విధించారు. అదేవిధంగా 30 ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గ్రామస్థులతో మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఎన్డీపీఎస్ చట్టం కింద ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఓటీపీ, యూపీఐ మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.ఇటీవల నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి, పునరావృతంగా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు సహకరించాలని, గ్రామంలో మత సామరస్యాన్ని కాపాడాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో సిఐలు యాసీన్, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, శ్రీలక్ష్మి, పోలీస్ అధికారులు, సుమారు 120 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

