దమ్మపేట రూరల్, జులై 07 : కోకో పంట సాగుకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టు ఉద్యాన అధికారి కిశోర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోకో పంట సాగుకు పాక్షిక నీడ అవసరమైనందున కొబ్బరి, ఆయిల్‌పామ్ పంటల్లో అంతర్ పంటగా కోకో సాగు చేసుకోవచ్చని తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక హెక్టార్లో ఐదు వందల మొక్కలను నాటుకోవాలన్నారు. వీటికి మొదటి సంవత్సరం రూ.18 వేలు, రెండో ఏడాది రూ.12 వేలు మొత్తం కలిపి రాయితీ నిధులు లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న రైతులు ఆయా మండలాల ఉద్యాన అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు.