జూలూరుపాడు, ఏప్రిల్ 22 : వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ నాయకుడు యల్లంకి సత్యనారాయణ మంగళవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీని మించిన రాజకీయ పార్టీ లేదనన్నారు. సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు దేశంలోని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, ప్రజలు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.