– పారిశ్రామికవాడలో బెల్ట్‌షాపు నిర్వాహకులకు సారపాక సర్పంచ్ హెచ్చరిక
బూర్గంపహాడ్, జూన్ 01 : బూర్గంపహాడ్ మండలంలో పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో బెల్టుషాపు నిర్వాహకులకు సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయక్ హెచ్చరికలు చేశారు. సారపాక ప్రధాన సెంటర్‌తో పాటు గుడి, బడి ప్రాంతాల్లో బెల్టుషాపు నిర్వాహకులు ఏర్పాటు చేసిన గొలుసుకట్టు దుకాణాలను తొలగించాలని లేదంటే సర్పంచ్‌గా బెల్టుషాపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. పబ్లిక్ ప్రదేశాలతో పాటు గుడి, బడి ప్రాంతాల్లో బెల్టుషాపులు ఏర్పాటు చేయడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా విద్యార్ధులు, యువత చెడు మార్గం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సారపాక పంచాయతీ తీర్మానం ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో, గుడి, బడి ప్రాంతాల్లో బెల్టుషాపులు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా తెలియచేసి నిబంధనల ప్రకారం వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.