‘కోయ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి’
బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల్లోని కోయ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో గత నాలుగు దశాబ్దాలుగా కనీస మౌలిక వసతులకు దూరంగా ఉన్నామని, తక్షణమే మౌలిక వసతులు ఆయా కోయ గిరిజన గ్రామాల్లో కల్పించాలని హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవిని...
– ఎస్సీ, ఎస్టీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్కు బూర్గంపహాడ్, అశ్వాపురం కోయ ఆదివాసీల వినతి
బూర్గంపహాడ్, అక్టోబర్ 16 : బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల్లోని కోయ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో గత నాలుగు దశాబ్దాలుగా కనీస మౌలిక వసతులకు దూరంగా ఉన్నామని, తక్షణమే మౌలిక వసతులు ఆయా కోయ గిరిజన గ్రామాల్లో కల్పించాలని హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవిని శుక్రవారం కలిసి కోయ ఆదివాసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. బూర్గంపహాడ్ మండలంలోని సారపాక పంచాయతీ శ్రీరాంపురం ఎస్టీ కాలనీ, మోతే పట్టీనగర్ పంచాయతీలోని చింతకుంట, అశ్వాపురం మండలంలోని మనుబోతులపాడు, జి.కొత్తూరు, కల్యాణపురం, అమ్మగారిపల్లి, వెంకటాపురం పంచాయతీల పరిధిలోని వేములూరు, గుల్లమడుగు, భీమవరం, మామిళ్లవాయి, పాలవాగు, మల్లెలమడుగు ఎస్టీకాలనీ, కుమ్మరిగూడెం, రాంనగర్, రైనిపేట తదితర గ్రామాలు కనీస వసతులకు దశాబ్ధాలుగా దూరంగా ఉన్నాయని, కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ వినతిలో పేర్కొన్నారు.
ఎస్టీ సరిఫికెట్లు అందక గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను కోల్పోతున్నారని, కొందరు కూలీపనులు చేస్తూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అర్హులకు ఎస్టీ కులధృవీకరణ పత్రాలతో పాటు పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని, గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, రహదారులు, విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో వాటిని కల్పించాలని ఆ వినతిలో పేర్కొన్నారు. వినతిపత్రం అందించిన వారిలో దళిత బహుజన్ ఫ్రంట్ జాతీయ నాయకులు శంకర్, ఎన్టీవో ప్రతినిధి డాక్టర్ శ్రీనివాస్, ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రతినిధులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

