Awareness | నాణ్యమైన దిగుబడుల కోసం..భూమి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి..

అశ్వారావుపేట: నాణ్యమైన పంట దిగుబడుల కోసం భూమిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.ఎం.మాధవి, ఎస్బీఐ కొత్తగూడెం రీజనల్ మేనేజర్ మహేశ్వర్లు రైతులకు సూచించారు. భూసార పరీక్షల ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని అన్నారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం పురష్కరించుకుని మండలంలోని మద్దికొండ దత్తత గ్రామంలో ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సౌజన్యంతో శనివారం భూసార పరీక్ష ఆవశ్యకత-సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ భూమి ఆరోగ్యంగా ఉంటేనే మన ఆరోగ్యం సురక్షితమని చెప్పారు. రైతులు వ్యవసాయ విజ్ఙానాన్నిపెంపొందించుకోవడానికి కళాశాల బోధనా సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారని ప్రకటించారు. ఆధునిక వ్యవసాయ పద్దతులను పాటిస్తూ రైతులు ఆర్థిక బలోపేతం కావటంతో పాటు భారత వ్యవసాయ రంగం పురోగతికి తోడ్పాటునందించాలని సూచించారు. భూమి ఆరోగ్యం పెంపొందించేందుకు దోహదపడే సేంద్రియ, వానపాములు, జీవన ఎరువులు, పఛ్చిరొట్ట ఉపయోగాలను వివరించారు.
అనంతరం నేల ఆరోగ్యం-పరిరక్షించుకోవటం అంశంపై రైతులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన రైతులకు బహుమతులు అందజేశారు. విద్యార్ధులకు డ్రాయింగ్, వ్యాసరచన, డాక్యుమెంటరీ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రోత్సాహకాలు అందించారు. అనంతరం కళాశాల ల్యాబ్‌లో తయారు చేసిన జీవన ఎరువులను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల శాస్త్రవేత్తలు డా.ఎం.రాం ప్రసాద్, డా.జి.గోపాలకృష్ణమూర్తి, డా.ఎం.సిద్దప్ప, డా.కె.శిరీష, డా.పి.శ్రీలత, డా.ఆర్.రమేష్, లక్ష్మణ్‌రావు, దత్తత గ్రామ నిర్వాహకులు ఎల్.రాజు, ఎస్బీఐ మేనేజన్ శ్రీహర్ష, ప్రదీప్ చక్రవర్తి, పలువురు రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

