బూర్గంపహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బూర్గంపహాడ్ మండలంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంఈఓ యదుసింహరాజు బుధవారం తెలిపారు.
బూర్గంపహాడ్, జూన్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బూర్గంపహాడ్ మండలంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంఈఓ యదుసింహరాజు బుధవారం తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశామని, విద్యార్థులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 28 ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నాయని.. ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో వీటిని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఆధార్ నమోదు కేంద్రంలో డెమోగ్రఫిక్, బయోమెట్రిక్, మ్యాండటరీ బయోమెట్రిక్, న్యూ ఎన్రోల్మెంట్ (కొత్త ఆధార్) సేవలు అందుబాటులో ఉంటాయని, 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటిన పిల్లలు, పెద్దలు వేలిముద్రల ద్వారా అప్డేట్ ఖచ్చితంగా చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

