కారేపల్లి : దేశాభివృద్ధిలో కీలక రంగమైన వ్యవసాయ రంగంలోని కార్మికులకు సమగ్ర చట్టం లేక నష్టపోతున్నారని వారికి చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వైరా డివిజన్ అధ్యక్షకార్యదర్శులు తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావులు డిమాండ్ చేశారు. వైరా డివిజన్ నూతన కమిటీ ని శనివారం కారేపల్లిలో జరిగిన మహాసభలలో ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులు తాళ్లపల్లి కఅష్ణ, కొండబయిన నాగేశ్వరరావు లతో పాటు మరో 23 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. దీనికి సంబంధించి మహాసభ వివరాలను ఆదివారం వారు వివరించారు.
వ్యవసాయ రంగంలో అధునిక పరికరాలు వినియోగంతో కూలీలకు పని తగ్గిపోయిందన్నారు. పేదలకు పనులు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉపాధిహామీ పధకాన్ని ఎత్తివేసే ప్రయత్నంలో నిధులు కేటాయింపు తగ్గిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వానికి పెద్దల లాభాలపై ఉన్న ప్రేమ, పేదల జీవితాలకు ఆధారమైన ఉపాధీ కల్పనపై లేదన్నారు. పేదల పోడు సాగుపై పారెస్టు నిర్భాందాలతో పాటు చేతికి వచ్చిన పంటల ధ్వంసానికి దిగటం విచారకరమన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ, కార్పోరేషన్లలో వీలిన గ్రామాల ప్రజలకు ఉపాధీ దూరమైందన్నారు.పట్టణ ప్రాంతాలకు ఉపాధీ హామీని విస్తరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కేంద్రం పేదల జన్‌ధన్ ఖాతాలలో పైకం జమచేయాలని, రాష్ట్రం ప్రభుత్వం పేదలకు రూ. 12 వేలు మంజూరు చేయాలన్నారు. పేదల సమస్యలపై వ్యకాస పోరాటా పంధానురూపొందించే క్రమంలో మహాసభలు ఉత్సహ భరితంగా జరిగాయన్నారు. ఈకార్యక్రమంలో వ్యకాస మండల అధ్యక్షులు కేసగాని ఉపేందర్, కార్యదర్శి యనమనగండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.