విద్యకు అత్యంత ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణం కోసం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సర్కారు బడులలో ఇంగ్లిష్ మీడియాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
- సర్కారు బడులలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రోత్సహిస్తాం
- పాఠశాలల పునఃప్రారంభంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల
- ప్రారంభమైన పాఠశాలలు.. తొలి రోజు 43 శాతం విద్యార్థుల హాజరు
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 12 : తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణం కోసం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సర్కారు బడులలో ఇంగ్లిష్ మీడియాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. నూతన విద్యా సంవత్సరం సందర్భంగా ఖమ్మంలోని ఎన్ఎస్సీ పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. తొలుత విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. విద్యాభివృద్ధికి పాటుపడుతున్నందునే ప్రభుత్వ పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నామని అన్నారు. విద్య కోసం ఎంతటి వ్యయాన్ని వెచ్చించేందుకైనా ప్రభుత్వం వెనకాడబోదని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా సుమారు 10 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, డీఈవో సోమశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లపై కలెక్టర్ అసంతృప్తి
పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా ఖమ్మం ఎన్ఎస్సీ పాఠశాలలో చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ వీపీ గౌతమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం, మంత్రి హాజరైన ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదంటూ డీఈవోపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసి చాలా రోజులైనప్పటికీ వాటికి సంబంధించిన పోస్టర్లను సదరు పాఠశాల గోడలపై తొలగించకపోవడం, డిజిటల్ తరగతుల కంప్యూటర్లను ఆన్‌చేసి పరిశీలించకపోవడం వంటి వాటి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల గురించి డీఈవోను, ప్రధానోపాధ్యాయుడిని కలెక్టర్ ప్రశ్నించగా.. కొందరు స్వయం సహాయక గ్రూపుల సభ్యులను చూపించారు.
తొలి రోజు 43 శాతం హాజరు..
జిల్లాలో తొలి రోజు పాఠశాలలకు 43 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లోని అన్ని రకాలకు చెందిన 2,490 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులు 61,314 మంది ఉన్నారు. కాగా, నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటి రోజైన బుధవారం నాడు 26,540 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆయా పాఠశాలలను ఎంఈవోలు, సెక్టోరల్ అధికారులు పరిశీలించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

