బుధవారం 02 డిసెంబర్ 2020
Khammam - Oct 23, 2020 , 04:31:10

విపత్తు ఏదైనా అత్యుత్తమ సేవలు

విపత్తు ఏదైనా అత్యుత్తమ సేవలు

  • 20 మంది సిబ్బందితో రెండు బృందాలు
  • 24/7 అందుబాటులో డిజాస్టర్‌ రెప్పాన్స్‌ ఫోర్స్‌
  • ప్రతికూల పరిస్థితుల్లోనూ పనిచేసే నిపుణులు
  •  నగర ప్రజలకు ఆత్మైస్థెర్యం నింపిన కేఎంసీలు

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఏడాది క్రితం పాపికొండల్లో పెద్ద లాంచీ గోదావరిలో మునిగింది. పదుల సంఖ్య లో ఉన్న పర్యాటకులు నీట మునిగారు. వెంటనే రంగంలోకి దిగింది నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్‌ (జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం). గోదావరి అణువణువూ గాలించి చాలామంది టూరిస్టులను రక్షించింది దళం. ఆ తరువాత కొన్ని రోజులకు రంగారెడ్డి జిల్లాలో ఓచిన్నారి బోరు బావిలో పడ్డా డు. అప్పుడూ క్షణాల్లో అక్కడికి చేరుకుంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అసమాన్య సాహ సం చేశారు. చిన్నారిని సురక్షితంగా కాపాడేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు. ప్రాణాలు నిలువకపోయినా పోరాటం గెలిచింది. అలాగే దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ ఏ విపత్తు సం భవించినా టక్కున గుర్తొచ్చేది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమే. అందుకు సమతూకమైన బృందాన్ని ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఏర్పాటుచేసింది రాష్ట్ర ప్రభుత్వం. శిక్షణ పొందిన అలాంటి బృందం ఒకటి ఇటీవల ఖమ్మం నగరంలో భారీగా కురిసిన వర్షాల సమయంలో అత్యుత్తమ సేవలందించింది.   

ఖమ్మం నగరంలో ఇటీవల ఈదురుగాలులతో కూడిన భా రీ వర్షాలు కురిశాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలి రహదారులకు అడ్డంగా పడ్డాయి. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు పొంగి రహదారులు జలమయ్యాయి. కొన్ని చోట్ల మ్యాన్‌హోళ్ల లోం చి నీళ్లు వెళ్లే మార్గం లేక వరద నీరు రోడ్డుపై నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో వరద నీరు పోటెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేసేందుకు, జనజీవనానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకునేందుకు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌)ను రంగంలోకి దింపింది ఖమ్మం నగర పాలక సంస్థ. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నా, ప్రతికూల వాతావరణం ఉన్నా సాహసంతో ముందుకు సాగారు డీఆర్‌ఎఫ్‌ బృంద సభ్యులు. ప్రజాజీవనానికి, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా సాహసోపేతమైన పనిచేశా రు. దీంతో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డీఆర్‌ఎఫ్‌ సభ్యు లు ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంలో ఈ డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇకనుంచి కూడా నగరంలో ఏ ప్రాంతంలో విపత్తులు ఏర్పడినా ఈ బృందాలు రంగంలోకి దిగుతాయి. రహదారులపై కూలిన చెట్లను, తెగిపడిన విద్యుత్‌ స్తంభాలను తొలగించనున్నాయి. 

ఇటీవల ఖమ్మం నగరంలోని బస్‌ డిపో రోడ్డు నుంచి, 27వ డివిజన్‌ రేవతి సెంటర్‌ నుంచి ఫిర్యాదులు అందుకున్న వెంటనే డీఆర్‌ఎఫ్‌ టీం సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద వస్తువులను నిమిషాల్లోనే తొలగించారు. అక్కడే దారికి అడ్డుగా ఉన్న చెట్లను కూడా తొలగించారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. అవసరమైన చోట్ల ప్రజల విజ్ఞప్తి మేరకు అధికారుల సూచనలతో డీఆర్‌ఎఫ్‌ బృందాలు సేవలను అందిస్తున్నాయి. ఈ విభాగంలోని 20 మంది సిబ్బంది విపత్తుల ప్రతిస్పందనల నిర్వహణలో సుశిక్షతులుగా శిక్షణ పొందారు. నగరంలో ఏ విధమైన విపత్తులు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఫోర్స్‌ను ప్రస్తుతం నగర పాలక సంస్థ కలిగి ఉందని కేఎంసీ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేందుకు బృంద సభ్యులు సిద్ధంగా ఉన్నారనే ైస్థెర్యం నగరవాసుల్లో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందించిన సేవలను నగరంలోని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు సోషల్‌ మీడియా వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. 

మున్నేటిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన టీం..

ఇటీవల చింతకాని మండలంలోని మున్నేరు సమీప గ్రామానికి చెందిన ఓ రైతు పశువులను తోలుకొచ్చేందుకు మున్నేరు మధ్యలో ఉన్న గట్టుకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చేలోపే వరద ఉధృతి పెరిగింది. దీంతో రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. తన దగ్గర ఉన్న సెల్‌ ద్వారా గ్రామస్తులకు, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. వారు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డీఆర్‌ఎఫ్‌ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే వదర ఉధృతి పెరగడం, రాత్రి పూట వెలుతురు లేకపోవడం వల్ల పోలీసులు, గ్రామస్తుల సూచన మేరకు తెల్లవారే వరకు వేచి చూశారు. ఉదయాన్ని బాధితుడిని సురక్షితంగా గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గ్రామస్తులు, బాధితుడి కుటుంబసభ్యులు, పోలీసులు.. డీఆర్‌ఎఫ్‌ సభ్యులను అభినందించారు. విపత్తుల కారణంగా ఏర్పడే ఇబ్బందుల్లో ప్రజలకు వారు అండగా నిలవడాన్ని పలువురు ప్రశంసించారు.