ఆదివారం 12 జూలై 2020
Khammam - May 07, 2020 , 01:12:30

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

ఖమ్మం, నమస్తే తెలంగాణ/మయూరి సెంటర్‌/రఘునాథపాలెం: వలసకూలీలు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సో ర్సింగ్‌ సిబ్బందికి బుధవారం తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జిల్లా సంఘం అధ్యక్షుడు పొట్టపింజర రామయ్య, టీఎన్‌జీవోస్‌ హౌస్‌బిల్డింగ్‌ సొసైటీ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు సరుకులను పంపిణీ చేశారు. 19వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు గోళ వెంకట్‌ 27 మంది  కార్మికులకు నిత్యావసర వస్తువులు  పంపిణీ చేశారు.12వ డివిజన్‌లోని ముస్తాఫానగర్‌లో కాకినాడ క్రీస్తు సంఘం డైరెక్టర్‌ డాక్టర్‌ కేజీ కుమార్‌, సంధ్యారాణి దంపతుల  ఆర్థిక సహాయంతో ప్రజలకు నగదు, 25 కేజీల బియ్యం ప్యాకెట్లను  జెట్టి రోజా, గాంధీ ఆధ్వర్యంలో, 9వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు కులిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 300 మంది కి పంపిణీ చేశారు. నగరానికి చెందిన అమన్‌ అలీ మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి పువ్వాడ సేవా సమితి ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో

అశ్వారావుపేట రూరల్‌/ములకలపల్లి/దమ్మపేట: ప్రతిభ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వినాయకపురం, మల్లాయగూడెం పంచాయతీల్లో సర్పంచ్‌లు నారం రాజశేఖర్‌, పొడియం సీతలు మాస్క్‌లు పంపిణీ చేశారు. బచ్చువారిగూడెంలో సర్పంచ్‌ కుంజా గంగాభవానీ, ఎంపీటీసీ పద్దం కుమారి రేషన్‌ పంపిణీ ప్రారంభించారు. దమ్మపేటలోని బంజారా కాలనీలో 115 కుటుంబాలకు  ఆత్మ చైర్మన్‌ కేదాసి వెంకటసత్యనారాయణ(కేవీ) సహకారంతో అందించిన కూరగాయలను మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బుధవారం అందజేశారు.  శ్రీరాంపురం కాకరవాయి చెరువులో వలస కూలీలకు 1098 చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్లు అన్నామణి, బాలస్వామిల సహకారంతో అందించిన కూరగాయలను జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు అందజేశారు. 

సత్తుపల్లి నియోజకవర్గంలో..

సత్తుపల్లి, నమస్తేతెలంగాణ/వేంసూరు/కల్లూరు: ఆషా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ బుధవారం వేంసూరు రాజుగూడెంలో వలసకూలీలకు నిత్యావసరాలను అందజేశారు. రేజర్ల, వెంకటాపురం చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్క్‌లు, పండ్లు పంపిణీ చేశారు. కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో సర్పంచ్‌ అంకిరెడ్డి అనుశారెడ్డి సహకారంతో అందించిన కూరగాయలను ఎమ్మెల్యే సండ్ర వెంక టవీరయ్య పంపిణీ చేశారు. సత్తుపల్లి పట్టణంలోని జవహర్‌నగర్‌, విరాట్‌నగర్‌లోని పేదలకు సామాజిక సేవకురాలు కొనకళ్ల సుధ కూరగాయలు పంపిణీ చేశారు. 

 వైరా నియోజకవర్గంలో..

కొణిజర్ల/ఏన్కూరు/కారేపల్లి రూరల్‌/వైరారూరల్‌ : ప్రభుత్వ సహాయంతో తమ గ్రామాలకు వెళ్లిన వలస కూలీలు తెలంగాణ ప్రభుత్వానికి, యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏన్కూరు మండలంలోని హిమామ్‌నగర్‌ పంచాయతీలో ఉపాధి కూలీలకు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బానోత్‌ సురేశ్‌నాయక్‌ మాస్క్‌లు పంపిణీ చేశారు. గరికపాడులో నేనున్నా మహిళా మండలి వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో వైరా జడ్పీటీసీ కనకదుర్గ, ఏవో పవన్‌కుమార్‌ పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 

కొత్తగూడెం నియోజకవర్గంలో..

లక్ష్మీదేవిపల్లి/కొత్తగూడెం ఎడ్యుకేషన్‌/సుజాతనగర్‌/చుంచుపల్లి/రామవరం/కొత్తగూడెం టౌన్‌: లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఉమ్మడి చాతకొండ పంచాయతీలో పేదలకు నిత్యావసర సరుకులను బుధవారం టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేందర్‌రావు పంపిణీ చేశారు. ఎదురుగడ్డ పంచాయతీలో జడ్పీటీసీ సభ్యురాలు మేరెడ్డి వసంత, సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పారిశుధ్య కార్మికులకు, కొత్తగూడెంలోని గరిమెళ్లపాడు, రామాంజనేయ కాలనీలో నిరుపేదలకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ ప్రారంభించారు. కొత్తగూడెంలోని యాచకులకు పాదరక్షలను ఆజాం యువసేన సభ్యులు పంపిణీ చేశారు.

పినపాక నియోజకవర్గంలో

మండలంలోని గడ్డిగూడెంలో పాయం యువసేన ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసర సరుకులను మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఆళ్లపల్లి మండల కేంద్రంలో కానిస్టేబుల్‌ కోటి సహకారంతో ఎస్సై అంజయ్య 22 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. జిల్లా ఫొటో, వీడియోగ్రాఫర్స్‌ సంఘం సహకారంతో ఫొటోగ్రాఫర్లకు ఆర్థికసాయం అందజేశారు.

బూర్గంపహాడ్‌లో యాజకులకు దుగ్గిరెడ్డి యలకొండారె డ్డి, అదనపు ఎస్సై మదార్‌ భోజనం అందించారు.

ఇల్లెందు నియోజకవర్గంలో...

ఇల్లెందు రూరల్‌: మండలంలోని మొండితోగు, పూబెల్లి, సుదిమళ్ల, బొజ్జాయిగూడెం పంచాయతీల్లో రెండువేల కుటుంబాలకు నిత్యావసర సరుకులతోపాటు వంట సామగ్రిని ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టెల కృష్ణ పంపిణీ చేశారు. 

భద్రాచలం నియోజకవర్గంలో...

భద్రాచలం/దుమ్ముగూడెం: భద్రాచలంలో బూసిరెడ్డి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ వినోద్‌, కొత్తూరు నారాయణపురంలో సాయిబాబా ఆలయం తరఫున కురిచేటి శ్రీనివాసరావు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. రామాలయం పరిసరాల్లో అన్న ప్రసాదాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు కోటగిరి ప్రబోద్‌కుమార్‌, తుమ్మలపల్లి దనం, పోతుల శ్రీనివాస్‌, జేడీ ఫౌండేషన్‌, చాంబర్‌ ఆఫ్‌కామర్స్‌ బాధ్యులు భోజనం అందజేశారు. లక్ష్మీనగరం, ములకపాడు గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో సరుకులను సీఐ వెంకటేశ్వర్లు అందజేశారు.

మధిర నియోజకవర్గంలో..

మధిర, నమస్తేతెలంగాణ/ చింతకాని: లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం అన్నారు. మండల పరిధి నాగవరప్పాడులో న్యాయవాది చావలి రామరాజు, నాగరాజు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఆయన బుధవారం పంపిణీ చేసి మాట్లాడారు. ఇల్లెందులపాడులో అన్న ఫౌండేషన్‌ చైర్మన్‌ మేళం శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలు, మధిర ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో అన్నం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రోగులకు భోజన ప్యాకెట్లను, ఆత్కూరు లో సర్పంచ్‌ సంధ్యా రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులకు శానిటైజర్లు పంపిణీ చేశారు. చింతకాని మండలం మత్కేపల్లి నామవరంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో వలసకూలీలకు నిత్యావసరాలు, కూరగాయలను సర్పంచ్‌ తిరుపతి కొండలరావు పంపిణీ చేశారు.

పాలేరు నియోజకవర్గగంలో..

ఖమ్మం రూరల్‌, నమస్తేతెలంగాణ/ నేలకొండపల్లి/తిరుమలాయపాలెం : రూరల్‌ మండలం పెద్దతండాకు చెందిన పారిశుధ్య కార్మికులకు టీఆర్‌ఎస్‌ నాయకుడు మూడ్‌ రామ్మూర్తినాయక్‌ సరుకులు, రూ.వెయ్యి నగదు అందజేసి సన్మానించారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ నేలకొండపల్లి మండలశాఖ ఆధ్వర్యంలో నర్సిరెడ్డి బుధవారం పేదలకు సరుకులు పంపి ణీ చేశారు. ఎంఈవో పురుషోత్తమరావు, నాయకులు రవి, వీరబాబు,  నర్సయ్య, అరవింద్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, గురవయ్య, శంకర్‌రావు, నాగార్జున్‌, భాస్కర్‌రావు పాల్గొన్నారు. వలస కార్మికులకు  తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో షేక్‌ బాషా, చామకూరి రమేశ్‌,  సురేందర్‌ భోజనం అందించారు.


logo