e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home ఖమ్మం ఆత్మగౌరవానికి ప్రతీక ‘కేసీఆర్‌ టవర్స్‌'

ఆత్మగౌరవానికి ప్రతీక ‘కేసీఆర్‌ టవర్స్‌’

హైదరాబాద్‌ తరహాలో ఖమ్మంలో నిరుపేదలకు గేటెడ్‌ కమ్యూనిటీ
2021 దసరా పండుగను ఎన్నటికీ మరువను మంత్రి అజయ్‌
టేకులపల్లిలో 1004మంది లబ్ధ్దిదారులతో గృహప్రవేశాలు

రఘునాథపాలెం, అక్టోబర్‌ 16 : ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లిలో నిర్మించిన ‘కేసీఆర్‌ టవర్స్‌’ పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్రూం పథకంలో భాగంగా రూ.60 కోట్లతో టేకులపల్లిలో నిర్మించిన 1004 డబుల్‌ బెడ్రూం ఇండ్లలోకి శుక్రవారం దసరా పర్వదినాన ఖమ్మం నగరానికి చెందిన లబ్ధిదారులతో గృహప్రవేశాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ పాల్గొని లబ్ధిదారులకు హక్కు పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేరోజు వెయ్యి మంది నిరుపేదలు గృహప్రవేశాలు చేసిన 2021 దసరా పండుగను ఎన్నటికీ మర్చిపోనని అన్నారు. 2017లో టేకులపల్లిలో 4వందల ఇండ్లతో మొదలైన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ప్రస్తుతం 11ఎకరాల విస్తీర్ణంలో 1,250 ఇండ్లు ఒకేచోట నిర్మించినట్లు తెలిపారు. దీపావళి నాటికి మిగిలిన 250మందికి ఇండ్లు అందజేస్తామని అన్నారు. హైదరాబాద్‌ తరహాలో ఖమ్మంలో గేటెడ్‌ కమ్యూనిటీని నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్‌ టవర్స్‌గా నామకరణం చేసిన ఇండ్ల సముదాయంలో సకల సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఇండ్లు త్వరగా పూర్తికావడానికి కృషి చేసిన కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌, అధికారులు, గుత్తేదారులను మంత్రి సన్మానించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించిన ఈ సభలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, మేయర్‌ పునకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, నగర పాలక కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, గ్రంథాలయ చైర్మన్‌ ఖమర్‌, డిప్యూటీ మేయర్‌ ఫాతీమా జొహ్రా, ఏఎంసీ చైర్మన్‌ లక్ష్మీప్రసన్న, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్జేసీ కృష్ణ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆర్డీవో రవీంద్రనాథ్‌, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

మంత్రి పువ్వాడ
రఘునాథపాలెం, అక్టోబర్‌ 16 : టీఆర్‌ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం రఘునాథపాలెంలో జరిగిన మండల ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి నెలా ఒక గ్రామాన్ని ఎంచుకొని మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్‌కు సూచించారు. వచ్చే నెల 25న హైదరాబాద్‌లో జరిగే ప్లీనరీ సభకు ముఖ్య నాయకులు తరలిరావాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్‌ విజయ్‌కుమార్‌, మద్దినేని వెంకటరమణ, ఎంపీపీ గౌరి, జడ్పీటీసీ ప్రియాంక, జిల్లా నాయకులు భాస్కర్‌రావు, నర్సింహారావు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, హరిప్రసాద్‌, లక్ష్మణ్‌గౌడ్‌, రవి, ప్రమీల, మండల నాయకులు వెంకటేశ్వర్లు, రామారావు, విజయ్‌రెడ్డి, రామ్మూర్తినాయక్‌, ఆరిఫ్‌, రామకృష్ణ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement