కారేపల్లి (వైరా), నవంబర్ 08 : 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఖమ్మం జిల్లా వైరాలో గల టిజిఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల (బాలికలు)లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా ప్రారంభోత్సవ వేడుకకు జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. విజయం సాధించాలనే ప్రయత్నం చేయాలని, అపజయంలోనూ ధైర్యంగా ఉండాలని, జీవితంలో ధైర్యాన్ని ఎప్పుడూ వదిలి పెట్టకూడదన్నారు.
లక్ష్య సాధనలో కృషి, నిబద్ధత, పట్టుదల ఎంతో ముఖ్యమని వివరించారు. అనంతరం అండర్-14, 17, 19 విభాగాల్లో గెలిచిన విజేతలకు, రన్నరప్స్కు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్, పిఈటిలు, స్కూల్ టీమ్ కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మల్టీ జోనల్ అధికారి కె.అలివేలు, డిసిఓ ఎం.రాజ్యలక్ష్మీ, స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సమత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Karepally : విజయవంతంగా 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు

Karepally : విజయవంతంగా 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు