కారేపల్లి, ఏప్రిల్ 08 : కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన 108 వాహనాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. అంబులెన్స్ లోని పరికరాలు, నిర్వహణ, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను పరిశీలించారు. అదేవిధంగా నెలవారీ కేసుల సగటుపై ఆరా తీశారు. 108 అంబులెన్స్ సిబ్బంది 24 గంటలు అప్రమతంగా ఉంటూ క్షత్తగాత్రులను గోల్డెన్ అవర్ లో ఆసుపత్రులకు చేర్చాలని సూచించారు. తనిఖీలో అడిట్ అధికారి వెంకటేశ్వర్లుతో పాటు ప్రోగ్రామ్ మేనేజర్ నూరుద్దీన్, సూపర్వైజర్ దుర్గాప్రసాద్, 108 సిబ్బంది అనిత, సంపత్ పాల్గొన్నారు.