Kapulapally | పెద్దపల్లి రూరల్ డిసెంబర్ 20 : పెద్దపల్లి మండలం కాపులపల్లి సర్పంచ్ గా ఎన్నికైన మ్యాదరవేని మల్లేష్ యాదవ్ ను శనివారం కాపులపల్లి యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు సర్పంచ్ ను తన నివాసంలో కలిసిన సంఘం పెద్దలు పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ కాపులపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తూ యాదవులు అధికారంలో ఉంటే గ్రామం ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారో నిజాయితీ పాలన ఇలా ఉంటుందని సమాజానికి ఆదర్శంగా కాపులపల్లి ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు యాదవ సంఘం నాయకులు కొమురయ్య, కుమార స్వామి, సింగారపు పోచమల్లు, గట్టయ్య, కొమురయ్య లు తదితరులు పాల్గొన్నారు.