Vemulawada | వేములవాడ, ఫిబ్రవరి 28 : వేములవాడలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం వేడుకలను టైలర్ షాప్ యజమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లేడీస్ టైలర్ అధ్యక్షుడు సింగర్ శ్రీను మాట్లాడుతూ టైలర్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా దేశంలో 1819 జన్మించిన విలియమ్స్ అతి చిన్న వయసులోనే 1845 కుట్టు మిషన్ రూపొందించి ఫిబ్రవరి 28న ప్రపంచానికి అందించాలని గుర్తు చేశారు. ఈ వృత్తి పైన ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని అన్నారు.
కుట్టు మిషన్ రూపొందించిన విలియమ్స్ ను గుర్తు చేసుకునే విధంగా టైలర్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వాసం భూమేశ్వర్, అధ్యక్షులు సింగర్ శ్రీనివాస్, క్యాషియర్ పాషా, ప్రధాన కార్యదర్శి కోడం సురేష్, ఉపాధ్యక్షులు గుడిసెల ఆశ, ప్రచార కార్యదర్శి సతీష్, యూనియన్ సభ్యులు గణేష్, భాగ్యశ్రీ, మానస, కావ్య తదితరులు ఉన్నారు.