Arkandla | వాగు పొంగితే.. ఆ ఊరికి రాకపోకలు కట్.. అర్కండ్ల వాగుపై ఏళ్లుగా తప్పని తిప్పలు
వర్షం కురిసిందంటే చాలు. శంకరపట్నం మానకొండూరు, మండలాల గ్రామస్తుల్లో ఆందోళన మొదలవుతుంది. భారీ వర్షాలకు ఆర్కండ్ల వాగు పొంగిపొర్లడంతో లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోతున్నాయి.
- హైలెవల్ వంతెన నిర్మించాలని స్థానికుల డిమాండ్
Arkandla | శంకరపట్నం, సెప్టెంబర్ 24 : వర్షం కురిసిందంటే చాలు. శంకరపట్నం మానకొండూరు, మండలాల గ్రామస్తుల్లో ఆందోళన మొదలవుతుంది. భారీ వర్షాలకు ఆర్కండ్ల వాగు పొంగిపొర్లడంతో లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాలన్నా.. ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి రావాలన్నా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
వర్షాకాలంలో తరచూ ఇదే పరిస్థితి ఎదురవుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఇబ్బందులు తీవ్రంగా ఉంటున్నాయని వాపోతున్నారు. అర్కండ్ల వాగుపై హైలెవల్ వంతెన నిర్మిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అర్కండ్ల సర్పంచ్ నేదురు పవన్ పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

