Sri Arunodaya Degree College | కోరుట్ల, సెప్టెంబర్ 18: కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్స్ లో శనివారం శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు అరుణోదయ వైభవం 2025 పేరిట ఏర్పాటు చేసిన స్వాగతోత్సవ వేడుకలు అలరించాయి. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన సాంస్కృతిక, సినీ, జానపద నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు నూతన టెక్నాలజీపై దృష్టి సారించాలన్నారు.
సమాజంలో పోటీ తత్వం అలవర్చుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని మాదకద్రవ్యాలకు అలవాటు పడవద్దు అన్నారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తల్లిదండ్రులు గురువులకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ట్రాస్మా అధ్యక్షులు కేరళ హై స్కూల్ కరస్పాండెంట్ ఎంఏ భారీ, లిటిల్ జీనియస్ హై స్కూల్ కరస్పాండెంట్ బండి మహదేవ్, మాస్ట్రో విద్యా సంస్థల చైర్మన్ ఆకుల రాజేష్, శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, కళాశాల డైరెక్టర్లు కోడెల రాజేంద్రప్రసాద్, కొత్త రాజు, తదితరులు పాల్గొన్నారు.