Chigurumamidi | న్యాయం చేస్తేనే ఇళ్ల కూల్చివేతకు అనుమతిస్తాం.. చిగురుమామిడిలో బాధితుల ఆందోళన
హుస్నాబాద్ నుంచి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వరకు చేపట్టనున్న ఫోర్‌లైన్ రహదారి నిర్మాణంలో భాగంగా చిగురుమామిడి మండల కేంద్రం మీదుగా రహదారి విస్తరణకు సంబంధించి గ్రామసభ మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ అకవరం భవాని అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.
- రోడ్డు వెడల్పుపై గ్రామసభలో ఆర్డీవో ఎదుట పలువురి డిమాండ్
- సమస్యలు పరిష్కరిస్తామని ఆర్డీవో షర్మిల హామీ
Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 22 : హుస్నాబాద్ నుంచి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వరకు చేపట్టనున్న ఫోర్‌లైన్ రహదారి నిర్మాణంలో భాగంగా చిగురుమామిడి మండల కేంద్రం మీదుగా రహదారి విస్తరణకు సంబంధించి గ్రామసభ మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ అకవరం భవాని అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. రోడ్డు విస్తరణకు గ్రామసభ ఆమోదం కోసం ఆర్డీవో షర్మిల హాజరుకాగా, రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్ వ్యక్తం చేశారు. గ్రామసభలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు విస్తరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ముఖ్యంగా రహదారి విస్తరణ కారణంగా ఇళ్లు కోల్పోతున్న బాధితులు తమ సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉన్న ఇళ్లలో సగానికి పైగా భాగం రహదారి విస్తరణలో 211 ఇళ్లకు గాను 300 కుటుంబాలు కోల్పోవాల్సి వస్తుందని, ఇళ్లు కోల్పోయిన తర్వాత తాము ఎక్కడ నివసించాలంటూ వారు ప్రశ్నించారు.ప్రభుత్వం తమకు పూర్తి న్యాయం చేయాలని, ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు తగిన పరిహారం, ప్రత్యామ్నాయ నివాస సదుపాయం కల్పించాలని బాధితులు కోరారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిన తర్వాతే రహదారి విస్తరణకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు తమ ఇళ్లను కూల్చివేయడానికి అనుమతించబోమని, తాము ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు తేల్చిచెప్పారు.
బైపాస్‌పై గ్రామస్తుల భిన్నాభిప్రాయాలు
ఇదిలా ఉండగా, రహదారిని గ్రామం వెలుపల బైపాస్ ద్వారా ఏర్పాటు చేయడంపై కూడా గ్రామసభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది గ్రామస్తులు గ్రామం మీదుగా రహదారి వెళ్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాన రహదారి గ్రామం వెలుపల బైపాస్ ద్వారా వెళ్తే గ్రామంలో వ్యాపార కార్యకలాపాలు తగ్గి, భవిష్యత్ అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు రోడ్డు విస్తరణతో ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్న కుటుంబాలకు ముందుగా న్యాయం చేయాలని బాధితులు పట్టుబట్టారు. అభివృద్ధిని తాము వ్యతిరేకించడం లేదని, అయితే తమ నివాసాలు, ఆస్తులు కోల్పోతున్న నేపథ్యంలో తగిన పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే పనులు చేపట్టాలని వారు కోరారు.
సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తాం: ఆర్డీవో
గ్రామస్తులు, బాధితులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అభ్యంతరాలను ఆర్డీవో షర్మిల సావధానంగా విన్నారు. రహదారి విస్తరణకు సంబంధించి బాధితుల సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. బైపాస్ కు ఎక్కువగా అవకాశం లేక పోవచ్చు అనే అంశాన్ని గ్రామసభలో ఆర్టీవో తెలిపారు. గ్రామ అభివృద్ధి, రహదారి విస్తరణతో పాటు బాధితుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరారు. గ్రామసభలో ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడంతో రహదారి విస్తరణ అంశంపై చిగురుమామిడిలో ఆసక్తికరమైన చర్చ సాగింది. ఈ గ్రామ సభలో తహసీల్దార్ కోడం కనకయ్య, ఎస్సై జగదీశ్వర్, ఆర్అండ్బీ ఏఈ సురేష్, ఉపసర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ చిట్టిమల్ల రవీందర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కాల్వ రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

