Indiramma houses | పెద్దపల్లి రూరల్, జూలై 21 : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగేలా చూస్తామని, పేదవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాంపల్లి , మారెడుగొండ, గుర్రాంపల్లి, గ్రామాల్లో పలు సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముగ్గులు పోసి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్ఠీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని కొందరు గిట్టనివారు మాత్రమే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహరెడ్డి, ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ, నాయకులు నూగిళ్ల మల్లయ్య, కనపర్తి ప్రభాకర్ రావు, గన్నమనేని తిరుపతిరావు, గన్నమనేని సంపత్ రావు, కలబోయిన మహేందర్, గుమ్మడి విజయ్ , ముత్యాల నరేష్ , సూత్రపు పరమేశ్వర్ , సంపత్ రావు, పంచాయతీ కార్యదర్శులు సోనియా తదితరులు పాల్గొన్నారు.