Peddapally MLA Vijaya Ramana rao| ఓదెల, నవంబర్ 3: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఓదెల మండలంలోని కొలనూరు, గోపరపల్లి గ్రామాల్లో సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని తెలిపారు. రైతులకు ధాన్యం కటింగ్ లేకుండా కొనిపించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే చెప్పారు. ఏమైనా సమస్యలు వస్తే తనకు ఫోన్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, బైరి రవి గౌడ్, సింగిల్ విండో సీఈవో గోలి అంజిరెడ్డి, మల్లన్న ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, నాయకులు గుండేటి మధు, బొంగోని రాజయ్య గౌడ్, ఢిల్లీ శంకర్, కొంచెం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.