Sarangapur | సారంగాపూర్, ఆగస్టు 21 : గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్పీవో వాసవి అన్నారు. మండలంలోని భీంరెడ్డి గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డులు, హాజరు రిజిస్టర్స్, వివిధ రికార్డులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు మురికి కాలువలు శుభ్రం చేయించాలని, ఇంటి పన్నులు వసూలు చేయాలని సూచించారు. గ్రామంలో తాగునీటి సరఫరా, డంఫిగ్ యార్డ్, నర్సరీల నిర్వహణలపై అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అందరి సమన్వయంతో పంచాయతీ సిబ్బంది గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీవో సురేష్ రెడ్డి, కార్యదర్శి జల, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.