Jagityal | మల్లాపూర్, మే 31 : ఐక్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సర్వాయి పాపన్న గౌడ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు గొల్లపల్లి రామ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని కేమర్ గార్డెన్ లో మల్లాపూర్ మండల గౌడ సంఘం ఏర్పాటుకు ఏర్పాటు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ గౌడ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతీ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు హాజరైనట్లు ఏ గ్రామంలో సమస్యలు వచ్చిన అందరం కలిసికట్టుగా ఎదుర్కొని సమస్యలు పరిష్కార దిశగా పరిష్కారం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంగురామ గౌడ్, సలహాదారులు పున్నం రామ గౌడ్, ముధం సత్రాన్న గౌడ్, మల్లాపూర్ సొసైటీ అధ్యక్షులు ముధం శరత్ గౌడ్, పాపన్న కమిటీ మండల అధ్యక్షుడు బండి లింగస్వామి గౌడ్, మాజీ సర్పంచులు రంగురామ గౌడ్, ఆనంద్ గౌడ్, హనుమంత్ గౌడ్, గుండు రాజా గౌడ్, రమేష్ గౌడ్ సుద్దాల కార్తీక్ గౌడ్ పొన్నం రామ గౌడ్, పెరుమల్లా అర్జున్ గొట్టిపర్తి రమేష్, గుర్రం రాజా గౌడ్, శ్రీనివాస్ గౌడ్ రాజేష్ ఆకుల గంగాధర్ నరస గౌడ్ రాజు సందీప్ గొట్టిపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కు సన్మానం
మల్లాపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో సర్వాయి పాపన్న రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి రామ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంగురామా గౌడ్, జాతీయ సంఘం గౌడ సంఘం సలహాదారుడు పొన్నం రామ గౌడ్, ముద్దం సత్యనారాయణ గౌడ్, మల్లాపూర్ సొసైటీ అధ్యక్షులు ముద్ధం శరత్ పాపన్న కమిటీ మండల అధ్యక్షులు బండి లింగస్వామి గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గుండు రాజేష్, మాజీ సర్పంచులు రంగురామా గౌడ్ ఆనంద్ గౌడ్ నాయకులు వీరేశం సుద్దాల కార్తీక్ గౌడ్ పొన్నం రామ గౌడ్, పెరుమల అర్జున్ గొట్టిపర్తి రమేష్ శ్రీనివాస్ గౌడ్, రమేష్, ఆకుల గంగాధర్, చిన్ను నరసయ్య గౌడ్, రాజా గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.