Karimnagar | తిమ్మాపూర్, మే25: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీద ఆరోపణలు చేసే ముందు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాస్తవాలు తెలుసుకోవాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బండారి రమేష్, సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, సుధగొని లక్ష్మీనారాయణ గౌడ్ అన్నారు. ఎల్ఎండీ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, ప్రజలకు అవసరమయ్యే పథకాలు మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. గ్రామ సభలు పెట్టి అర్హులను గుర్తించి వారు మాత్రమే ఎంపిక చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసత్య ఆరోపణలు మానుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు.
ఈ సమావేశంలో ఎల్లపల్లి సంపత్, మాచర్ల అంజయ్య, మామిడి అనిల్, పోలు రమేష్, రాము, గోపు మల్లారెడ్డి, దావు సంపత్ రెడ్డి, రెడ్డిగాని రాజు, గోదరి రాజమల్లు, ఆవుల మహేష్ చంద్ర, తమ్మనబోయిన కిరణ్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.