Huzurabad | హుజురాబాద్ టౌన్, జూన్ 29: హుజురాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మారుతి నగర్ లో రజక సంఘం ఆవరణలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తి ధరల పెంపుదల, మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంఘం ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. అలాగే ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలు అందించారు.
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొలిపాక శ్రీనివాస్ రూ.50వేలు, మాజీ కౌన్సిలర్ నల్ల సుమన్ రూ.20116, కొండపాక శ్రీనివాస్ రూ.15వేలు, సభ్యులు నల్ల బాలరాజ్, కొల్లిపాక శంకర్, కొలిపాక సారయ్య, నల్ల సదయ్య రూ.10వేలతో పాటు మరికొందరు దాతలు విరాళాలు అందించారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కులవృత్తుల ధరలు పెంచడం ద్వారా ఆర్థికంగా చేయూత లభిస్తుందన్నారు. సంఘ సభ్యులు కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. అలాగే సంఘంలోని ప్రతీ ఒక్కరికి సంఘం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం బాధ్యులు కొలిపాక సారయ్య, కొండపాక శ్రీనివాస్ నల్ల బాలరాజు గోపు వెంకటేశ్వర్లు కొలిపాక శ్రీనివాస్, కొలిపాక శంకరయ్య, రజక మహిళా సంఘం బాధ్యులు కొండపాక లక్ష్మి, లలిత, నిమ్మటూరి నిర్మల, కొలిపాక రాజేశ్వరి, గోపు శాంత కుమారి లతో పాటు సంఘ సభ్యులు, కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.