Koppula Eshwar | ధర్మారం, జులై 20 : కాంగ్రెస్ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు యాగాలు, హోమాలు చేసినంత మాత్రాన సాగునీళ్లు రావని, కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి సాగునీటిని అందించి రైతాంగాన్ని ఆదుకొని కరువును పారదోలాలని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నీరు లేక వెలవెలబోతున్న నంది రిజర్వాయర్ను ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రిజర్వాయర్ లో తేలిన శిఖం భూమిలో కబడ్డీ, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రిజర్వాయర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఓవైపు కరువు తరుముకు వస్తున్న నివారించడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఎల్నీనో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, దానిని అధిగమించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
రైతాంగం కరువు కోరల్లో చిక్కుకొని బాధపడుతూ ఉంటే సాగునీటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ నుంచి రోజు లక్ష క్యూసెక్కుల నీరు తరలిపోతా ఉంటే నిమ్మకి నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీటిని ఎందుకు ఎత్తి పోయటం లేదని ప్రశ్నించారు. సాగునీటి సమస్యను పరిష్కారం చేయవలసిన రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు కొంతమంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు వానల కోసం వరుణ యాగం, హోమాలు చేయడం వల్ల ఫలితం ఏముందని ఈశ్వర్ ప్రశ్నించారు. యాగాలు చేసి దేవుడికి మొక్కడాన్ని తాను వ్యతిరేకించడం లేదని ఆయన పేర్కొన్నారు. యాగాలు, హోమాలు చేస్తే రైతులకు జరిగే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులను కరువు బారి నుండి రక్షించాలని సదుద్దేశం ప్రభుత్వానికి ఉంటే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నింపి నంది రిజర్వాయర్ ద్వారా గాయత్రి పంప్ హౌస్ కు తరలించి ఎక్కడి నుంచి మిడ్ మానేరు కు ఎత్తిపోస్తే కొండపోచమ్మ వరకు ఉన్న సుమారు 40 లక్షల ఎకరాల వరకు సాగునీరంది పంటలు సస్యశ్యామలమై రైతుల గోసతీరుతుందని ఆయన పేర్కొన్నారు. కానీ నేడు నంది రిజర్వాయర్ లో సరైన నీటిమట్టం లేక శిఖం భూమి తేలి వెలవెలబోతుందని ఆయన అన్నారు .
దీంతో ఇక సాగునీరు అండదని ఆందోళన రైతుల్లో నెలకొందని అన్నారు .తాను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన హయాంలో ప్రజలకు అందుబాటులో ఉండి సాగునీటి సమస్యల కోసం ప్రయత్నం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఎస్సారెస్పీ డీ83/బీ కాలువకు అనుబంధంగా ఉన్న ధర్మారం,వెల్గటూర్ మండలాల్లోని సుమారు 11,000 ఎకరాలకు శాశ్వతంగా తాగు నీటిని అందించాలని సంకల్పంతో ధర్మారం నంది రిజర్వాయర్ నుంచి లింకు కాలువ నిర్మాణం కోసం రూ.12 కోట్ల నిధులతో నిర్మించిన ఇప్పటికీ సాగునీటిని విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. అదేవిధంగా కొత్తపల్లి, బొమ్మరెడ్డిపల్లి గ్రామాల్లోని నాన్ కమాండ్ ఏరియా ప్రాంతాలకు సాగునీటి అందించాలని కాలువ నిర్మాణానికి నిధులు చేసినప్పటికీ దాని పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. అదేవిధంగా కొత్తపల్లి శివారులో మ్యాదరి కండి,కానంపల్లి భీమన్న చెరువు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ వాటిని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నాడని ఈశ్వర్ ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, పలువురు డైరెక్టర్లు, పార్టీ తాజా మాజీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, ఆర్బీఎస్ మాజీ జిల్లా సభ్యులు పూస్కురు రామారావు, ఎగ్గేల స్వామి, ఆర్బీఎస్ మాజీ మండలాధ్యక్షుడు పాకాల రాజయ్య, పార్టీ సర్పంచులు మోతే కనకయ్య, సంకసాని సౌజన్య సతీష్ రెడ్డి, శైనేని రవి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మిట్ట తిరుపతి, ధర్మారం మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు దేవీ రమణ, బొడ్డు రాములు, సాన రాజేందర్, మిట్ట సత్తయ్య, మిట్ట భరత్, నేరెళ్ల చిన్న లచ్చయ్య, కడారి లాలయ్య, రెడపాక శ్రీనివాస్, ఆకారి సత్యం, తుమ్మల రాంబాబు, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, బద్దం లక్పతి రెడ్డి, బొలిశెట్టి సుధాకర్, గాండ్ల నరసయ్య, బాలసాని తిరుపతి, దేవి నలినీకాంత్, దేవీ వంశీకృష్ణ, అయిత వెంకటస్వామి, అడువాల రవి, సంధినేని కొమురయ్య, కాంపల్లి అపర్ణ, మార్కర్ సంధ్య, మర్రి మమత తదితరులు పాల్గొన్నారు.