గంగాధర, ఆగస్టు 21 : ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నదని, అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఎత్తిపోయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్‌ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలకు అవకాశం ఉన్నా ఎందుకు సరఫరా చేయడం లేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణపూర్‌ను నింపితే చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు వేములవాడ నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గాంధీ భవన్లో కూర్చుండి కేటీఆర్, హరీశ్‌రావుపై అవాకులు చెవాకులు పేలుతున్నాడని, అక్కడ కూర్చుండి మాట్లాడుడు కాదని, చొప్పదండి నియోజకవర్గంలో రైతులు పడుతున్న అవస్థలు చూడాలని హితవుపలికారు. ఎమ్మెల్యేగా రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో నిరూపించాలని డిమాండ్ చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఆయన వెంట నాయకులు మేచినేని నవీన్‌రావు, సాగి మహిపాల్‌రావు, ఆకుల మధుసూదన్, వేముల దామోదర్, మడ్లపెల్లి గంగాధర్, రామిడి సురేందర్, ఎండీ నజీర్, శ్రీమల్ల మేఘరాజు, దూలం శంకర్‌గౌడ్, పొట్టల కనుకయ్య, ముక్కెర మల్లేశం, పంజాల అంజనేయులు, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, వడ్లూరి ఆదిమల్లు, జోగు లక్ష్మీరాజం, వంగల మల్లికార్జున్, గడ్డం స్వామి, మామిడిపెల్లి అఖిల్, గర్వందుల పర్శరాములు, పొన్నం రాములు ఉన్నారు.