Renigunta | తిమ్మాపూర్, జులై19: తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తోటపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి శ్రీనివాస్ అనే యువుకులు గర్భిణీ కి రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు. వివరాల ప్రకారం.. నాంపల్లి సంధ్య అనే మహిళ పురిటి నొప్పులతో కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. కాగా ఆమెకు బ్లడ్ తక్కువగా ఉందని వైద్యులు సూచించారు.
బీ నెగెటీవ్ బ్లడ్ మూడు యూనిట్లు కావాలని వైద్యులు తెలపడంతో ఆమె బంధువులు రేణిగుంటకు చెందిన శ్రీనివాస్ ను సంప్రదించారు. ఆయన వెంటనే వెళ్లి రక్త దానం చేశారు. రక్తదానం చేసిన శ్రీనివాసును గ్రామస్తులు అభినందించారు. ఆయన ఇప్పటికీ 50 కి సార్లు పైగా రక్తదానం చేసినట్లు తెలిపారు. ఎవరికైనా అత్యవసరం అర్థం కావాలంటే 99080 82092 నంబర్ల సంప్రదించాలని కోరారు.