Vigyan Vidyaniketan | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 7: తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని విజ్ఞాన్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు కరాటే కుంగ్ ఫూ పోటీల్లో ఉత్తమ ప్రతభి కనబరిచారు. ఈమేరకు కరీంనగర్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ షోలిన్ కుంగ్ పూ,కరాటే స్టేట్ లెవల్ ఛాంపియన్ షిప్-2025 పోటీల్లో సత్తా చాటారు.
పాఠశాలలో చదువుతున్న బర్ల సాయి ప్రభంజన్, ఇట్టిరెడ్డి సహస్ర, రేగుల సాయి గోల్డ్ మెడల్స్ సాధించారు. అదేవిధంగా గంధం బార్గవ్, మల్లమారి జయంత్, గంధము దీప్తిలు సిల్వర్ మెడల్స్ సాధించగా, బర్ల లోహిత, రేకుల సాహితి, మల్లమారి అనిష్లు బ్రౌంజ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా వీరికి నిర్వహకులు మెడల్స్ తోపాటు ప్రశంస పత్రాలను అందించి అభినందించారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను విజ్ఞాన్ విద్యానికేతన్ ప్రిన్సిపల్ బొల్గం శ్రీ నివాస్, మాస్టర్ పసుల బాలరాజు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.