VHR Foundation | కోల్ సిటీ, మే 22: నిరుపేద యువతి వివాహానికి వీ.హెచ్.ఆర్ ఫౌండేషన్ చేయూత అందించింది. గోదావరిఖని గంగానగర్ కు చెందిన తల్లిదండ్రులు లేని తహీరా అనే యువతికి వివాహం నిశ్చయమైంది. మనవరాలి పెళ్లి కోసం నానమ్మ, తాతయ్యలు ఇబ్బంది పడుతున్న విషయంను స్థానికులు వీహెచ్ఎర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. కాగా స్పందించిన ఆయన అమ్మాయి వివాహం కోసం ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయాన్ని పంపించారు.
ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎండీ జాహిద్ పాషా ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు తస్నీం భాను చేతుల మీదుగా ఆ కుటుంబంకు రూ.10వేలు అందజేశారు. పలువురు మాట్లాడుతూ రామగుండం నియోజక వర్గంలోని ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆపత్కాలంలో ఆర్థిక సాయం అందజేస్తున్న హరీష్ రెడ్డి సేవా దృక్పథంను కొనియాడారు. ఆ యువతి వానమ్మ, తాతయ్యలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది షానవాజ్ రాజా, వంశీకృష్ణ, రొడ్డ సంపత్, గుండవేని సంతోఃవ, సువర్ణ, నాగేశ్వరరావు, రాణి తదితరులు పాల్గొన్నారు.