వేములవాడ టౌన్ , అక్టోబర్ 1 : శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం అమ్మవారు సిద్ధ్దిదా అలంకారంలో దర్శనమిచ్చారు. వేములవాడ రాజన్న ఆలయంలోని నాగిరెడ్డి మండపంలో కొలువుదీరిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, అర్చకులు, వేదపండితులు చతుష్షష్టి నిర్వహించారు. కాగా, అమ్మవారిని భక్తులు దర్శించుకొని తన్మయత్వంలో మునిగిపోయారు.