వేములవాడ/చందుర్తి, అక్టోబ ర్27: బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో సాధించిన ప్రగతిని చూసి మరోమారు పనిచేసే ప్రభుత్వానికి పట్టంకట్టాలని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు కోరారు. గ్యారంటీ లేని వారంటీలతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ మాట లు నమ్మి మోసపోవద్దని.. మళ్లీ ఆ రోజులు రావద్దన్నారు. శుక్రవారం ఆయన చందుర్తి మండలంలోని ఎనుగంటి, బండపల్లి, మర్రిగడ్డ మూడపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, స్థానిక నేతలతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాల ని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ప్రచారానికి తరలివచ్చి బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రగతిని గుర్తు చేస్తూ, మెట్ట ప్రాంతమైన చందుర్తి మండలానికి గోదావరి జలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షే మ ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని స్పష్టం చేశారు. 60ఏండ్ల కాంగ్రెస్ హయాంలో నీళ్లు, కరెంట్ లేక అష్టకష్టాలు పడ్డామని వాపోయారు. కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మకుం డా, ఆలోచించి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఆయా గ్రామాల్లో సమస్యలను వింటూ, పరిషారానికి కృషి చేస్తానని హామీఇచ్చారు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామాలకు వెళ్లిన చల్మెడ సమక్షంలో తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ అడిగొప్పుల లక్ష్మితోపాటు గ్రామానికి చెందిన మహిళలు, యువకులు సుమారు 50మంది బీఆర్ఎస్లో చేరారు. అట్లాగే ఎన్గల్ గ్రామానికి చెందిన బీజేవైఎం సీనియర్ నేత గుంటి గంగాధర్, బోరుగాయ నవీన్‌తోపాటు 20మంది యువకులు, బండపల్లికి చెందిన 20మంది యువకులు బీఆర్ఎస్లో చేరగా, జడ్పీ చైర్పర్సన్ నాల్యకొండ అరుణ, రాఘవరెడ్డి, చల్మెడ కండువా కప్పి ఆహ్వానించారు.
ఆయా కార్యక్రమాల్లో సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎంపీపీ బైరగోని లావణ్య, పార్టీ మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, కేడీసీసీబీ డైరెక్టర్ జలగం కిషన్ రావు, ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఆర్బీఎస్ డైరెక్టర్ బొప్ప వెంకన్న, ఏఎంసీ మాజీ చైర్మన్ దప్పుల అశోక్, కోఆప్షన్ సభ్యుడు కమలాకర్, ఎంపీటీసీలు మాదాసు కవిత, దారం కావ్య శ్రీ, పెగ్గర్ల రమేశ్‌రావు, సర్పంచులు లింగంపల్లి స త్తయ్య, న్యాత విజయ, ఉప సర్పంచులు పులి మంజుల, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, పులం రవి, మా జీ సర్పంచులు సంటి బాపూరావు, జువ్వాడి అనిల్‌రావు, గ్రామశాఖ అధ్యక్షులు ఆకుల ఎల్లయ్య, వట్టి మల్ల లక్ష్మణ్, లింగంపల్లి తిరుపతి, బింగి స్వామి, దారం రాజు, కాపిల్ల శంకర్, సోష ల్ మీడియా కన్వీనర్ నీరటి కిరణ్, సీనియర్ నేతలు బైరగోని రమేశ్, ఈర్లపల్లి రాజు ఏరెడ్డి రాజిరెడ్డి, బద్ధం బాపురెడ్డి, సిరిగిరి సుధాకర్, లింగంపల్లి బాబు, కొండ లక్ష్మణ్, మల్యాల గంగ నర్సయ్య ఉన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధికి యువత ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో కథలపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సుమా రు 20మంది యువకులు, తకళ్లపల్లి గ్రామానికి చెందిన 30మంది యువకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, ఆయ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీటీసీ నాగం భూమయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ దేవేందర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బాలు, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వర్రావు ఉన్నారు.