వైభవంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం
లయ బ్రహ్మ, నాద బ్రహ్మ, సద్గురు త్యాగరాజస్వామివారి 70వ ఆరాధనోత్సవాలు వేములవాడ రాజన్న ఆలయంలో బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు సంగీత ప్రియులను ఆద్యంతం అలరించాయి.
- సంగీతామృతం కురిపించిన సంగీత విద్వాంసులు
- నాదబ్రహ్మకు సుస్వరాల నివాళి
- ఆద్యంతం ఆకట్టుకున్న సంగీత కార్యక్రమాలు
వేములవాడ టౌన్, జనవరి 11 : లయ బ్రహ్మ, నాద బ్రహ్మ, సద్గురు త్యాగరాజస్వామివారి 70వ ఆరాధనోత్సవాలు వేములవాడ రాజన్న ఆలయంలో బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు సంగీత ప్రియులను ఆద్యంతం అలరించాయి. ఉదయం 7 గంటలకు స్వస్తి పుణ్యాహవాచనంతో ప్రారంభం కాగా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల, కళాశాల విద్యార్థులు నగర సంకీర్తన చేశారు. అనంతరం వేదికపై పురాణం మహేశ్వర శర్మ, చౌటి లక్ష్మణ్ త్యాగరాజస్వామి జీవిత విశేషాలను తెలిపారు. ఉదయం 9 గంటలకు రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు కొరిడె నరహరి, మంజుల, రేవతి, అనుపమ బృందం చేసిన పంచరత్న గానం ఆహూతులను అలరించింది.
త్యాగరాజ పంచారత్నాల్లో జగదానంద కారక, ఎందరో మహానుభావులు కీర్తనలు సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేశాయి. 11.30గంటలకు శిఖామణి భాగవతార్ హరికథ, సాయంత్రం 4 గంటలకు రాయప్రోలు సుబ్రహ్మణ్యం హరికథ, సాయంత్రం 5.30 గంటలకు శ్రీవిద్య శాస్త్రీయ సంగీత కచేరి శ్రోతలను ఆనందడోలికల్లో ఓలలాడించింది. ఈ సందర్భంగా రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రామ తత్వాన్ని లోకానికి అందించిన భాగవతోత్తముడు త్యాగరాజస్వామివారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

