ACB Raids | సుల్తానాబాద్, జూన్ 28 : ఇంటి నంబర్ కోసం రూ.10వేలు డిమాండ్ చేసి రూ.ఐదువేల లంచం డిమాండ్ చేసి బాధితుడిని నుండి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు మున్సిపల్ అధికారులను పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం సుల్తానాబాద్ లో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ కథనం ప్రకారం.. పట్టణంలోని ద్వారక నగర్ కు చెందిన ఆర్నకొండ ప్రసాద్ అనే వ్యక్తి నూతనంగా నిర్మించుకున్న ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ సిబ్బందిని ఆశ్రయించాడు.
కాగా బాధితుడిని సంవత్సరం పాటు ఆర్ఐ వినోద్, బిల్ కలెక్టర్ నాంపల్లి విజయ్‌కుమార్ రూ.10వేల డబ్బులు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఆర్నకొండ ప్రసాద్ చివరకు రూ.5వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు రైడ్ చేసి ఆర్ఐ వినోద్, బిల్ కలెక్టర్ నాంపల్లి విజయ్‌కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కార్యక్రంలో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సీఐలు కృష్ణ కుమార్, తిరుపతి, పూర్ణచందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.