రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : యువతలో జాతీయ ఐక్యతను పెంపొందించేందుకే రన్‌ఫర్ యూనిట్ లాంటి కార్యక్రమాలు దోహద పడుతాయని ఎస్పీ మహేశ్ బీ గితె అన్నారు. సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం చేపట్టిన రన్‌ఫర్ యూనిటీ కార్యక్రమం విజయవంతమైంది. అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన రన్‌ఫర్ యూనిటీ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పోలీస్ అధికారు లు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచి పోయిందంటూ ఆయన సేవలను కొనియాడారు. అనంతరం జిల్లా కేంద్ర పోలీసు కార్యాలయంలో సర్ధార్ వల్లబాయ్ చిత్రపటానికి ఎస్పీ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, బెటాలియన్ కమాండెంట్ సురేశ్, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు రాందాస్, ఎస్‌లు సురేశ్, కృష్ణ, నాగేశ్వరరావు, ఆర్ఐలు మధూకర్, రమేశ్, యాదగిరి, ఎస్ఐలు, కిరణ్‌కుమార్, శ్రీకాంత్, శ్రావణ్ యాద వ్, సాయి, శ్రీనివాస్, బెటాలియన్ సిబ్బంది, విద్యార్థులు, యువత క్రీడాకారులు పాల్గొన్నారు.
వేములవాడ/ ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి/ చందు ర్తి/రుద్రంగి/ ఇల్లంతకుంట/ముస్తాబాద్/ సిరిసిల్ల రూరల్/ వేములవాడ రూరల్/ బోయినపల్లి రూరల్, అక్టోబర్ 31 : ఐక్యమత్యమే దేశానికి బలమని వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వేములవాడపట్టణంలోని మల్లారం చౌరస్తా నుంచి జర్మనీ గెస్ట్ హౌస్ వరకు 2కే రన్ నిర్వహించగా, ఆమె హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రామ్మోహన్ గౌడ్, యువకులు ఉన్నారు. ఎల్లారెడ్డిపేటలో పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఎచ్పీ పెట్రో ల్ బంకు నుంచి గాయత్రీ డిగ్రీ కళాశాల వరకు రన్ నిర్వహించారు. విజేతలుగా నిలిచిన యువకులకు కప్పును అందజేశారు. ఎస్ఐ రాహుల్‌రెడ్డి, విద్యార్థులు, యువకులు ఉన్నారు. వీర్నపల్లి యువత డ్రగ్స్‌కు దూరం గా ఉండాలని ఎస్ఐ వేముల లక్ష్మణ్ సూచిం చారు. అనంతరం మండలకేంద్రంలో రన్‌ఫర్ యూనిటీ నిర్వహించారు. ఎంఈవో తు మ్మ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మల్లారపు అరుణ్‌కుమార్, నేతలు రాకేశ్‌గౌడ్, ప్రశాంత్, పీడీ ప్రతాప్ పాల్గొన్నారు. చందుర్తి మండలకేంద్రంలో బస్టాండ్ నుంచి అమరవీల స్తూపం మీదుగా పోలీ స్ శాఖ ఆధ్వర్యంలో రన్‌ఫర్ యూనిటీ 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేశ్ విద్యార్థులు, యువకులు ఉన్నారు. రుద్రంగి మండలంలో అధికారులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ శ్రీనివాస్ యువకులు, నాయకులతో కలిసి 2కే రన్ నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఎస్ఐ సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలకేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఎస్ఐ గణేశ్ జెండా ఊపి ప్రారంభించారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలో పోలీసులు 2కే రన్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల నుంచి పోలీస్‌స్టేషన్ వరకు నిర్వహించారు. ర్యాలీలో ఎస్ ఐ ఉపేంద్రాచారి , రాపెల్లి ఆనందం, ఎగుర్ల కరుణాకర్, సుద్దాల శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాల నుంచి బస్టాండ్ వరకు రన్‌ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించా రు. ఎస్ఐ వెంకట్రాజం, ఎంఈవో కిషన్, ఏఎస్ఐ రవీందర్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలకేంద్రంలో ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.