సాగునీరు పుష్కలం
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు. విద్యుత్ కోసం పొలాల్లోనే రైతులు నిద్రించిన రోజులూ ఉన్నాయి. సాగునీటి వనరులు లేక భూగర్భజలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి.
- కేసీఆర్ హయాంలో ‘వ్యవసాయం’లో విప్లవాత్మక మార్పులు
- రైతన్నలకు తొలగిన సాగునీరు, విద్యుత్ ఇబ్బందులు
మోర్తాడ్, మే 31: ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు. విద్యుత్ కోసం పొలాల్లోనే రైతులు నిద్రించిన రోజులూ ఉన్నాయి. సాగునీటి వనరులు లేక భూగర్భజలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి. ఎప్పటికప్పుడు తగ్గిపోతున్న భూగర్భజలాలు ఒకవైపు, విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి మరోవైపు అటువంటి పరిస్థితుల్లో రైతులు పంటలకుసాగునీటిని అందించేందుకు వాటర్స్టోరేజీ ట్యాంకులను రూ. లక్షలు వెచ్చించి నిర్మించుకున్నారు.
అవి అప్పుడు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కానీ ప్రస్తుతం అవి వ్యవసాయక్షేత్రాల్లో నిరుపయోగంగా మారాయి. దీన్ని బట్టే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో.. స్వరాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో అన్నది.
నాడు స్టోరేజీ ట్యాంకులు తప్పనిసరి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు రైతులు సాగునీటి వనరులు లేక కేవలం బోరుబావులపై ఆధారపడి పంటలను పండించేవారు. బోరుబావులు నడవాలంటే విద్యుత్ అవసరం. కానీ విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీంతో రైతులు వ్యవసాయక్షేత్రాల్లో లక్షల రూపాయలు వెచ్చించి వాటర్స్టోరేజీ ట్యాంకులను నిర్మించుకునేవారు. బోరుకు ఆటోమేటిక్ స్టార్టర్‌ను అమర్చి బోరు నీళ్లు వాటర్స్టోరేజీ ట్యాంకులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకునే వారు. వాటర్స్టోరేజీ ట్యాంకు నిండిన తర్వాత పంటలకు నీటిని అందించేవారు. దీంతో విద్యుత్ వచ్చినప్పుడే పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు.
ఇది అప్పటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఎంతో అవసరమని లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న వాటర్స్టోరేజీ ట్యాంకులు నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది. కారణం కేసీఆర్ పాలనలో రైతులకు 24గంటల ఉచితవిద్యుత్ సరఫరా చేయడం, సాగునీటి వనరులను పెంపొందించడమని చెప్పవచ్చు. విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండడంతో రైతులకు వీలున్నపుడు పొలాల్లోకి వెళ్లి పంటలకు నీరందించే వారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, వాగుల్లో చెక్‌డ్యాంలు నిర్మించడం, వరదకాలువలో ఏడాదంతా నీళ్లు ఉండేలా చూడడం.. వీటన్నింటి ఫలితంగా భూగర్భజలాలు పెరిగాయి. దీంతో బోరుబావులు ఎండిపోయే పరిస్థితులు కూడా లేకపోవడంతో వ్యవసాయక్షేత్రాల్లో నిర్మించుకున్న వాటర్స్టోరేజీ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. కేసీఆర్ కారణంగా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

