ముకరంపుర, జూన్ 27 : నగర పాలక సంస్థ పరిధిలోని చింతకుంట బృందావన్ కాలనీ ప్రధాన దారి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. కరీంనగర్ – వేములవాడ ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా లోతట్టుగా ఉన్న ఈ ప్రాంతాన్ని సమాంతరంగా చేయడంతో రోడ్డు ఎత్తు పెరిగి ట్రాన్స్ఫార్మర్ రోడ్డు దిగువకు చేరింది. చేతికి తాకేలా ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో భయం.. భయంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రత్యేకంగా ఎత్తయిన కాంక్రీట్ గద్దె నిర్మించినప్పటికీ విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను దానిపైకి చేర్చకుండా అలానే వదిలేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.