Vemulawada | వేములవాడ, ఆగస్టు 28 : వేములవాడ పట్టణంలోని బస్టాండ్ వద్ద వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అయింది. శుక్రవారం రక్షాబంధన్ వేడుకల సందర్భంగా ఇతర పట్టణాలు గ్రామాల నుండి వేములవాడకు చేరే కరీంనగర్, నంది కమాన్ రహదారులతోపాటు తిరిగి వెళ్లేందుకు మూల వాగు వంతెన పై సైతం వాహనాల రద్దీ నెలకొంది. రెండవ బైపాస్ రహదారి పార్క్ నుండి మొదలుకొని తిప్పాపూర్ బస్టాండ్ వరకు వాహనాలు ఒకదానిని ఆనుకొని మరొకటి మెల్లిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు కరీంనగర్ నుండి, సిరిసిల్ల వైపు నుండి కూడా వేములవాడ కూడా భారీగా వాహనాలు వస్తుండగా బస్టాండ్ కూడలి వాహనాలతో రద్దీగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బస్టాండ్ కూడలి వద్ద రహదారులను నియంత్రిస్తూ ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని తక్షణమే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వాహనదారులు సురక్షితంగా బయటపడ్డారు.