విభజన రాజకీయాలకు కాలం చెల్లింది
దేశప్రజలను మతప్రాతిపదికగా విభజించి ఓట్లు దండుకొనే రాజకీయాలకు కాలం చెల్లిందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్‌ఎస్ రవీంద్రనాథ్ అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
- ఎల్ఐసీ యూనియన్ మహాసభల్లో జోనల్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్
కరీంనగర్ విద్యానగర్, జూలై 14: దేశప్రజలను మతప్రాతిపదికగా విభజించి ఓట్లు దండుకొనే రాజకీయాలకు కాలం చెల్లిందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్‌ఎస్ రవీంద్రనాథ్ అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎల్ఐసీలోని అతిపెద్ద యూనియన్ ఏఐఐఈఏ కరీంనగర్ డివిజన్ 28వ మహాసభలను ఆదివారం నగరంలోని పద్మనాయక కల్యాణమండపంలో నిర్వహించారు. రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ మతాన్ని అడ్డంపెట్టుకొని ఓట్లడిగి దేశప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. చైతన్యవంతులైన ప్రజలు 400 సీట్లను ఆశించిన బీజేపీని 240 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. బలమైన ప్రతిపక్షంతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం బలపడుతుందని అభిప్రాయపడ్డారు.
సర్కారు సహకారం లేకున్నా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ అద్భుతమైన ప్రగతిని సాధించి మార్కెట్ లీడర్‌గా తన సుస్థిరం చేసుకున్నదని చెప్పారు. ఈ సమావేశానికి అతిథులుగా యూనియన్ జోనల్ అధ్యక్షులు పీ సతీశ్, సంయుక్త కార్యదర్శి జీ తిరుపతయ్య, కోశాధికారి శ్రీనివాసన్, సికింద్రాబాద్ డివిజనల్ ప్రధాన కార్యదర్శి రఘు హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా ఎల్ఐసీ క్లాస్ 1 అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ సత్యనారాయణ, డెవలప్మెంట్ ఆఫీసర్స్ సంఘ నాయకులు వాసుదేవారెడ్డి, ఏజెంట్ యూనియన్ నుంచి గట్టు రాజయ్య, రైతు సంఘం నుంచి వాసుదేవారెడ్డి, సీఐటీయూ నాయకులతో పాటు పూర్వపు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 13 ఎల్ఐసీ బ్రాంచ్‌లకు చెందిన 200 మంది సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

