Peddapally | పెద్దపల్లి, జూన్ 12( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించనున్నారు. కాగా వారికి స్వాగతం పలుకుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర రూపొందించిన టూర్ షెడ్యూల్ వాల్ పేపర్స్ పై రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ఫొటోలను ముద్రించారు. అయితే ఆ టూర్ షెడ్యూల్ పై కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సంబంధించి ఫొటోలు ముదిరించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండల కేంద్రంలో శుక్రవారం నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం, పెద్దపల్లిలో కలెక్టరేట్ సఖీ కేంద్రం సమీపంలో పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి(కలెక్టరేట్ సమీపంలో) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం, పెద్దపల్లి సాగర్ రోడ్డు వద్ద గల కూరగాయల మార్కెట్ లో నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన, పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి, రాంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం, చందపల్లి గృహ సముదాయాల వద్ద పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన రోడ్ షెడ్యూల్ ను ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద సోషల్ మీడియా గ్రూపుల్లో చేసిన పోస్టుల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫోటోలు లేకపోవడం పట్ల ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.