Rasamayi Balakishan | కమీషన్లపై ఉన్న సోయి కరువుపై లేదు.. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
రాష్ట్రమంతా కరువు కాటకాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం పంటలు వేయొద్దని డిక్లరేషన్లు కోరుతూ కరువు జాబితాలో కొన్ని మండలాలనే చేర్చడం ఏంటని, పాలకులకు కమీషన్లపై ఉన్న సోయి కరువుపై లేదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
- నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలని డిమాండ్
Rasamayi Balakishan | తిమ్మాపూర్, అక్టోబర్ 31 : రాష్ట్రమంతా కరువు కాటకాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం పంటలు వేయొద్దని డిక్లరేషన్లు కోరుతూ కరువు జాబితాలో కొన్ని మండలాలనే చేర్చడం ఏంటని, పాలకులకు కమీషన్లపై ఉన్న సోయి కరువుపై లేదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కరువుతో పంటలు వేయద్దు అన్నప్పుడు అన్ని మండలాలు కరువు జాబితాలో చేర్చాలి అని డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిసి కూడా పైనుండి వస్తున్న నీళ్లను ఎత్తిపోయకుండా జాప్యం చేసి ఇప్పుడు పంటలు వేయద్దని కోరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 10 ఏళ్ల కాలంలో కాలమైనా కాకపోయినా ఎండల్లో సైతం కాలువల్లో నీళ్లు పరుగులు పెట్టాయని గుర్తు చేశారు. ఎలాంటి ముందస్తు ఆలోచన లేని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వపంల్లి సత్యనారాయణ కనీసం నియోజకవర్గంలోని మండలాలను కరువు జాబితాలో చేర్చుకోలేని దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో రాష్ట్రానికి నీళ్లు అందించే ప్రముఖ ప్రాజెక్టులు ఉన్నా కూడా కరువు లేకుండా చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని కరువును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేని దౌర్భాగ్యంలో ఆయన ఉన్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి కమీషన్ల కక్కుర్తిలో గాలికి వదిలేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు మండలాల్లో చేర్చకపోతే ఎమ్మెల్యేని బాధ్యత వహించాలని, వారం రోజుల్లో జాబితాలో చేర్చకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

