Veenavanka | వీణవంక, జూలై 31: వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే రాజిరెడ్డి విద్యార్థులు, కళాశాల కోసం చేసిన సేవలు ఆదర్శనీయమని అధ్యాపకులు కొనియాడారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే రాజిరెడ్డి పదవీ విరమణ పొందారు. కాగా కళాశాల అధ్యాపకుల ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజిరెడ్డికి శాలువా, పూలమాలవేసి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల, విద్యార్థుల అభివృద్ధికి అందించిన సేవలు అభినందనయమని కొనియాడారు. రానున్న రోజుల్లో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్, గ్రంథపాలకుడు రామ్మోహన్, కత్తెరశాల, జైపాల్ రెడ్డి, శోభన్‌బాబు, కల్పన, కరుణ, సుమలత, స్వప్న, శైలజ, తాజొద్దీన్, జమీల్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.